చదువుల తల్లి సావిత్రి బాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో సావిత్రి బాయి పూలే, జ్యోతి రావు పూలే విగ్రహలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన నాయకులు, బీసీ జాగృతి సేన మండలప్రధాన కార్యదర్శి గొడుగు నర్సిములు, బీసీ జాగృతి సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa