ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:47 PM

2018 సెప్టెంబరు 14న ప్రణయ్ హత్య జరగ్గా ఇన్నాళ్లకు ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. నల్గొండ జిల్లా రెండో అడిషనల్ సెషన్స్ జడ్జి రోజారమణి నేడు ముద్దాయిలకు శిక్షలు విధించారు. ఏ2 సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగిలిన ముద్దాయిలకు జీవితఖైదు విధించారు. ఈ కేసులో తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతం అవుతూ అతడి సమాధిని ముద్దాడారు. ప్రణయ్ సమాధికి పూలమాల వేసి, గులాబీ పూలతో అలంకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa