తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లిలో ప్రజా పాలన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభలో దాదాపు 50 వేల మంది హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్ టెక్నాలజీ టెంట్లను వేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించారు. దీంతో పాటు.. రూ.12.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చర్లతండా వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.26 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ స్థాయి ఆఫీస్ కాంప్లెక్స్, రూ.45. 5 కోట్లతో ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు, రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు వంటి పనుల్లో పాల్గొన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో భాగంగా రూ.148.76 కోట్లతో ఆర్‌ఎస్ ఘన్‌పూర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు, రూ.25.6 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోకవర్గంలో 750 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.
ఇక ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ రూ.58 లక్షలు జీతం తీసుకున్నాడన్నారు. ఏనాడైన గత ప్రభుత్వం మహిళలను ఆదుకుందా.. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందా.. అస్సలు పట్టించుకుందా అని ప్రశ్నించారు. మా అప్పులు ఎలా పెరిగాయి.. మీకు లక్ష కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. కొందరు దోపిడీ దొంగలకు నా మీద కొపం ఉండవచ్చు.. సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ గార్లు జాతిపితలు అవుతారు.. కానీ.. తెలంగాణను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడని మండిపడ్డరు. కేసీఆర్ అన్నింటికి బకాయిలు పెట్టి వెళ్లాడన్నారు. మా ప్రభుత్వం వచ్చాకే వరంగల్ కు ఎయిర్ పోర్ట్ వచ్చిందని.. వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు కూడా మా ప్రభుత్వం వచ్చాకే వచ్చిందన్నారు. అంతే కాదు.. మా ప్రభుత్వం వచ్చాకే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. రైతురుణమాఫీ చేసినందుకు నాపై కోపం ఉంటుందా..? లక్ష కోట్లు సంపాదించే నైపుణ్యం ఏంటో మా యువతకు నేర్పాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa