తెలంగాణలో మండుతున్న ఎండలు . నేడు 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్. ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు అరెంజ్ అలెర్టు జారీ చేసింది
![]() |
![]() |