గోరు బోలి (లంబాడి) భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో చేర్చేందుకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని స్వాగతిస్తూ శుక్రవారం ఆమనగల్లులో గిరిజనులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని, లంబాడి భాషాభిమానులకు గొప్ప గర్వకారణం అని పేర్కొన్నారు. నాయకులు జగన్, మానయ్య, కృష్ణ నాయక్, రాగ్య, భాస్కర్, మల్లేష్ పాల్గొన్నారు.
![]() |
![]() |