ఒక ఆదివాసీ మహిళగా అణగారిన వర్గాలు ఎదుర్కొనే కష్టాలను తాను ప్రత్యక్షంగా అనుభవించానని మంత్రి సీతక్క తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న దళిత ప్రగతి సదస్సుకు మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. ‘మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. ఈరోజు పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా స్త్రీ సంక్షేమం మంత్రిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను’ అని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |