ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజాన్ సందర్భంగా ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 05:54 PM

ఈరోజు ప‌విత్ర‌ రంజాన్ మాసంలో ఆఖ‌రి శుక్ర‌వారం కావ‌డంతో చార్మినార్ వ‌ద్ద ఉన్న మ‌క్కా మ‌సీదులో ముస్లింలు సోద‌రులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల‌కు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వుతారు. చార్మినార్ నుంచి మ‌దీనా వ‌ర‌కు ముస్లింలు ప్రార్థ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఈ క్ర‌మంలో చార్మినార్, మ‌దీనా, శాలిబండ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు వ‌చ్చే రోడ్ల‌న్నింటినీ ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మూసేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com