నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంశివారులో ఒక ఖరీదైన కారు అగ్నికి ఆహూతైంది. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ప్రయాణిస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపడంతో అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa