బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అదివారం మాగనూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మేళ వాయిద్యాలతో ముందుగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జెండాను ఎగుర వేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa