కాళేశ్వరం ప్రాంతంలో కార్చిచ్చు మంటలు అదుపుతప్పి అడవిని కబళిస్తున్నాయి. మండలంలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నీలగిరి చెట్ల ప్లాంటేషన్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వేలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ క్రమంలో స్థానిక గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కాళేశ్వర ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు వంటల కోసం మంటలు వేసి, పూర్తిగా ఆర్పకుండా వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa