రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామంలో నిర్వహిస్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరబోసిన ధాన్యం తేమ శాతం గురించి ఆరా తీసి, టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa