తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మావోయిస్టులు కాస్త దిగొచ్చినట్లు తెలుస్తోంది. సైనిక ఆపరేషన్ వెంటనే ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని బస్తర్ ఇన్ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ లేఖపై పోలీసులు ఇంకా స్పందించలేదు. శాంతి చర్చలపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఇప్పటికి నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa