ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో దారుణం: భార్య నగ్న వీడియోలు తీసి భర్త వేధింపులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 06:43 PM

హైదరాబాద్‌లో ఓ యువకుడు తన భార్యపై అమానుష వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల వైద్యురాలిని పెళ్లిచేసుకున్న ఈ యువకుడు, ఆమె స్నానం చేస్తున్న వీడియోలను రహస్యంగా తీసి తన తండ్రికి చూపించాడు. దీంతో, యువకుడి తండ్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
అంతటితో ఆగని ఈ యువకుడు, తన భార్యను తండ్రితో పడుకోవాలని గదిలోకి పంపి వేధించాడు. అతడి వేధింపులు భరించలేక ఆ యువతి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో యువకుడు యువతుల నగ్న వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa