మాగనూరు మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మే 12వ తేదీ ఆదివారం నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఆహ్వానించేందుకు ఆలయ కమిటీ సభ్యులు శనివారం మక్తల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరవుతారని కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, మాగనూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa