ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని టీయుసిసిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు అన్నారు. మంగళవారం అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, ఉపాధి హామీ కింద పనిచేసే కార్మికులకు రోజు రూ. 600 కూలి ఇవ్వాలని, 200 దినాల పని కల్పించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె ద్వారా కార్మికుల హక్కులపై అవగాహన పెరిగి, వారి స్వీయహక్కులను సాధించే దిశగా చర్చలు సాగాలని వారు ఆశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa