ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్ గుజ్జా కృష్ణారెడ్డికి వడ్డించిన ప్లేటులో బల్లి కనిపించింది. ఈ విషయాన్ని రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా, ఆయన “మంచిగా ఫ్రై అయింది, తినండి” అని వివాదాస్పద సమాధానం ఇచ్చాడు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి, షేరిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెస్టారెంట్ మేనేజర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెస్టారెంట్‌లో ఆహార పరిశుభ్రతపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |