మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు.ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం
![]() |
![]() |