నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలలోకి ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) వెల్లడించింది. ఈ నిర్ణయంతో దేశంలోని పలు చారిత్రక కట్టడాలను, మ్యూజియంలను ఎలాంటి రుసుము చెల్లించకుండానే సందర్శించే అవకాశం ప్రజలకు లభించింది.దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, చరిత్ర గొప్పదనాన్ని వారికి తెలియజేయడమే ఈ ఉచిత ప్రవేశం కల్పించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఏఎస్‌ఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా అత్యంత విలువైన, అరుదైన పురావస్తు కళాఖండాలు కొలువుదీరిన 52 మ్యూజియంలలోకి ఉచితంగా వెళ్లే అవకాశాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా తమ సంస్థ పరిధిలో ఉన్న సుమారు 3,698 చారిత్రక ప్రదేశాల్లో కూడా ఈ ఉచిత ప్రవేశ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత తాజ్‌మహల్, ఎర్రకోటతో పాటు తెలంగాణలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోటలను కూడా ప్రజలు ఉచితంగా సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa