బెల్లంపల్లి మండల తహసీల్దార్‌గా కృష్ణ నియమితులై, ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జోష్ణ, తాండూరు మండలానికి బదిలీ కావడంతో, ఆమె స్థానంలో బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను తహసీల్దార్‌గా నియమించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది కృష్ణకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అధికారులు ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa