రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో గంభీరావుపేట మండలం కోళ్ళమద్ది గ్రామంలో ఉన్న పట్టు పరిశ్రమ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ వెంట జిల్లా, మండల స్థాయి అధికారులు ఉన్నారు. ఈ పరిశీలనలో పట్టు పరిశ్రమ కేంద్రం ఆవరణలోని సౌకర్యాలు, పనితీరును ఆయన గమనించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa