నారాయణపేట పట్టణంతో పాటు మండలంలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిక్షణలో అందించే అంశాలను ఉపాధ్యాయులు నెమ్మదిగా నేర్చుకుని, విద్యార్థులకు స్పష్టంగా బోధించాల్సిన అవసరం ఉంది అని సూచించారు. నూతన శిక్షణా విధానాల ద్వారా విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి (DEO) గోవిందరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, తెలుగు, భౌతిక శాస్త్రం, హిందీ, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం విషయాలకు సంబంధించి ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa