చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం, పట్టించుకొని ఎమ్మెల్యే . వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన 5 వేల క్వింటాళ్ల ధాన్యం. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన ధాన్యం, తీవ్ర ఆందోళనలో రైతులు . వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని, అధికారులు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు కానీ ధాన్యం మాత్రం కొనడంలేదని వాపోతున్న రైతులు . ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తమ ధాన్యం తడిసిందని, మొలకొచ్చిన ధాన్యం కూడా కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa