స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న హైదరాబాద్లో ఆర్ కృష్ణయ్య నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆదివారం పిలుపునిచ్చారు. బీసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోకుల్ కృష్ణ, మల్లికార్జున్, రాజేశ్వర స్వామి, చంద్రయ్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa