TG: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం బిల్లును తీసుకురావడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. #SayNoToBettingApps అనే ఉద్యమం.. కేంద్ర నిర్ణయంతో విజయవంతమైందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. "లెక్కలేనన్ని యువ జీవితాలను నాశనం చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేధించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా స్వాగతించదగినది. చారిత్రాత్మకమైనది. ఈ చర్య చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది' అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa