TG: భారీ వర్షం కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు జలమయం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో కామారెడ్డి- ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa