TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో శుక్రవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, PVNR మార్గ్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa