ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు తాజా వివరాలు ప్రాజెక్టు ఏఈఈ హరీశ్ బుధవారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు గాను ప్రస్తుతం 276.60 మీటర్లుగా ఉందన్నారు. నీటి సామర్థ్యం 0.571 టీఎంసీ లకు ప్రస్తుతం 0.354 టీఎంసీ లుగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా గడించిన 24 గంటల్లో 1160 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని, ప్రస్తుతం 1080 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని తెలిపారు