ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ పేలుడు ఘటనలో గాయపడిన గోపి శుక్రవారం ప్రాణాలు విడిచాడు. చందర్లపాడు మండలం, కూనయపాలెం గ్రామానికి చెందిన గోపి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa