TG: హైదరాబాద్ బాలాపూర్ గణేష్ చివరి పూజ పూర్తైంది. ప్రత్యేకంగా అలంకరించిన ట్రాలీలో గ్రామ పురవీధుల్లో తిరుగుతున్నాడు. బాలాపూర్ గణేశుడి పేరు వినగానే లడ్డూ వేలం టక్కున గుర్తొస్తుంది. ఈ లడ్డూ వేలం పాట ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. లడ్డూ కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలు పలికింది. ఈ సారి లడ్డు వేలం పాట మరింత పెరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa