నారాయణఖేడ్ లోని TSWRES గురుకుల పాఠశాలలో సెప్టెంబర్ 21 నుండి 27 వరకు 'ఫన్ ఫీల్డ్ దసరా క్యాంప్' నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో క్లాసికల్ డాన్స్, యోగా, లాజికల్ స్కిల్స్, మెడిటేషన్, బాలసభ, స్పోర్ట్స్ & గేమ్స్ వంటివి ఉంటాయి. 'శెట్కార్ చారిటబుల్ ట్రస్ట్' సభ్యురాలు శివాని శెట్కార్, 'మై విల్లెజ్ మాడల్ విల్లెజ్' సభ్యుడు చిత్తరంజన్ దాస్ ఈ వివరాలు తెలిపారు. విద్యార్థుల రిజిస్ట్రేషన్ కు సెప్టెంబర్ 15, 2025 చివరి తేదీ అని ఉన్నత పాఠశాల బోరంచ ప్రధానోపాధ్యాయులు ఎం. శివకుమార్ స్వామీ తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa