ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సోమవారం అధికారులు సంతకాలు చేశారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అత్యాధునిక నైపుణ్యాలతో, పరిశ్రమకు సిద్ధమైన నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పందం లక్ష్యమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa