దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. తెలంగాణకు చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ (బీజేడీ), పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఓటింగ్‌లో పాల్గొనకూడదని ప్రకటించాయి. ఈ మూడు పార్టీలు ఏ కూటమికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలవనున్నాయి.తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రకటించారు. పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. రైతుల సమస్యల నేపథ్యంలోనే తాము ఈ ఎన్నికలో ఎవరికీ మద్దతివ్వకుండా, తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa