జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అభ్యర్థి ఎంపికపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజల మద్దతు ఉంటే ఆ కుటుంబం మరొసారి గౌరవప్రదంగా ప్రజాసేవలో నిలబడతుందని కేటీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కుటుంబమే తిరిగి సమాజంలో కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలతో గోపీనాథ్ కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ ఖరారైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ నుంచి వచ్చే అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొన్న వేళ, కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషంగా మారింది.
పార్టీ కార్యవర్గంలోనూ గోపీనాథ్ కుటుంబానికి మద్దతు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుండగా, అధికారికంగా అభ్యర్థిని ప్రకటించడానికి ఈ వ్యాఖ్యలే ప్రాతినిధ్యంగా మారే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa