ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాయత్‌సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేశారు. ఫలితంగా రాజేంద్రనగర్ ఫుటేజ్ సర్వీస్‌రోడ్డుపై నీరు ప్రవహించడంతో రహదారిని రెండువైపులా మూసివేశారు. వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa