TG: హైదరాబాద్ యాకుత్‌పురాలో మ్యాన్‌హోల్ తెరిచి ఉన్న ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ విషయంపై ప్రాథమిక విచారణ చేపట్టామని, మ్యాన్‌హోల్ ఘటనకు హైడ్రా పూర్తి బాధ్యత వహిస్తుందని ఆయన తెలిపారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. మ్యాన్‌హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామని హైడ్రా కమిషనర్ చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa