దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం గాంధీభవన్ లో మాట్లాడుతూ, పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినప్పటికీ, 10 ఏళ్ల పాలనలో పాలమూరుకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2015లో కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పినా, 10 ఏళ్లలో పూర్తి చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల, ఆలంపూర్ లలో స్థానిక నాయకుల బలంతోనే గెలిచారని, పాలమూరులో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa