జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామ బస్టాప్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం వైపు వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ధర్మారం మండలం మేడారం, కటికెనపల్లి గ్రామాలకు చెందిన వెంకటేష్, మల్లేష్, సంతోష్ అనే ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa