ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ మహిళలకి లైంగిక వేధింపుల నిరోధక చట్టం వర్తించదంటున్న సుప్రీంకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 04:07 PM

రాజకీయ రంగంలో పనిచేస్తున్న మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్) కింద రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజకీయ పార్టీలకు, కార్యకర్తలకు మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం ఉండదని, కాబట్టి రాజకీయ పార్టీలను 'పని ప్రదేశం'గా పరిగణించజాలమని సోమవారం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. రాజకీయ పార్టీలను 'పోష్' చట్టంలోని 'పని ప్రదేశం' నిర్వచనం కిందకు ఎలా తీసుకురాగలమని ధర్మాసనం ప్రశ్నించింది. పార్టీకి, దాని కార్యకర్తలకు మధ్య యజమాని-ఉద్యోగి బంధం లేనప్పుడు, ఈ చట్టం వర్తింపజేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa