భారత వస్తువులపై అమెరికా భారీగా సుంకాలు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్న కీలక తరుణంలో, రష్యా తన మిత్రదేశమైన భారత్‌కు అండగా నిలిచింది. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం అత్యంత దృఢమైనదని, దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని మాస్కో స్పష్టం చేసింది. బయటి శక్తుల ఒత్తిళ్లకు, హెచ్చరికలకు భారత్ తలొగ్గకుండా సహకారాన్ని కొనసాగించడంపై రష్యా విదేశాంగ శాఖ ప్రశంసలు కురిపించింది. ఓ రష్యన్ అధికారి మాట్లాడుతూ, మాస్కోతో సంబంధాల విషయంలో భారత్ ఎటువంటి సంకోచం లేకుండా నిబద్ధతతో ముందుకు సాగుతోందని కొనియాడారు. ఇరు దేశాల భాగస్వామ్యం స్థిరత్వం, విశ్వాసం పునాదులపై నిర్మితమైందని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa