TG: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దల పండుగ కోసం పొట్టేళ్లను తీసుకెళ్తున్న ఆటో నాసనాల్లి సమీపంలో బోల్తాపడింది. అదే సమయంలో ఆటోపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజు (38), వ్యాపారి రవి (35) అక్కడికక్కడే మృతిచెందారు. రవి భార్య సరోజ తీవ్రంగా గాయపడగా, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa