మెదక్ జిల్లా రాజపేట్ బ్రిడ్జ్ వద్ద గంగమ్మ వాగులో చిక్కుకున్న 10 మందిని ప్రాణాలకు తెగించి రక్షించిన యువకుడు దేవిసింగ్‌ను ఎస్పీ గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ దేవిసింగ్ ధైర్యసాహసాలను కొనియాడుతూ, ఆయన పేరును జాతీయ స్థాయి ధైర్యసాహస పురస్కారాలకు నామినేట్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa