స్వచ్ఛతయే సేవ - 2025 (స్వచోత్సవం) లో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ మేనేజర్ సువీన్ కుమార్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (క్యూ. సీ) డా. రాఘవేంద్ర సింగ్, సీనియర్ అధికారులు కేఎన్కే ప్రసాద్, బిల్లా శ్రీనివాసరావు, సజిత్, రాము మరియు నిర్వాహకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa