గత నెల 14న పీఏసీఎస్ల పదవీకాలం ముగియడంతో, కొన్నింటిని ఆరు నెలలు పొడిగించి, మరికొన్నింటి పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు, నిర్వహణ లోపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని, పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, చేగొమ్మ, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పోచారం పీఏసీఎస్ల పాలకవర్గాలను రద్దు చేయగా, ఆయా చైర్మన్లు తమను కూడా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa