కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో శనివారం ఉదయం వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, జలాశయంలోకి 1637 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 40 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, 1597 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు కట్టపై నుండి మంజీర నది ద్వారా నిజాంసాగర్ రిజర్వాయర్ లోకి వెళ్తోంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 21.725 టీఎంసీల వరద నీరు పోచారం ప్రాజెక్టు నుండి మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి వెళ్ళింది.