TG: సూర్యాపేట జిల్లా రాయన్నగూడ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుమీద కొబ్బరికాయలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు, వాహనదారులు ఎగబడి అందిన కాడికి కొబ్బరికాయలు ఎత్తుకెళ్లారు. బస్తాలు, సంచుల్లో నింపుకుని తీసుకెళ్లిపోయారు. దీంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ వాపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa