ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అమ్మవార్ల ఆశీస్సులతో 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచి తాను పాదయాత్ర ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. నాటి పాలకులు సమ్మక్క-సారలమ్మ అభివృద్ధిపై వివక్ష చూపారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆలయం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa