తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు, ప్రభుత్వానికి, గ్రూప్-1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 అంశంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్-1 జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa