TG: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ చేసే సమయంలో పక్షిఫ్లైట్‌ను తాకింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల వరుస విమాన ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa