కుర్దువాడి-షోలాపూర్ మధ్య రైల్వే వంతెనపై ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుండటంతో సికింద్రాబాద్-ముంబై మార్గంలో పలు ముఖ్యమైన రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ కారణంగా, 22731 ముంబై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 10గంటలు ఆలస్యం కావడంతో హుస్సేన్‌సాగర్ (12701) ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు. ముంబై-సికింద్రాబాద్ దురం తో ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్- పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa