కరోనా మహమ్మారి వచ్చి తగ్గాక కూడా దాని ప్రభావాలు చాలామందిని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాసన పసిగట్టే శక్తి తగ్గిపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. అయితే, చాలామందికి తమకు ఈ సమస్య ఉన్నట్టు కూడా తెలియకుండానే ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారని ఒక తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వాసన శక్తి తగ్గిపోయిందని భావిస్తున్న వారే కాకుండా, తమకు ఎలాంటి సమస్యా లేదనుకుంటున్న వారిలోనూ ఈ లోపం ఉన్నట్టు తేలింది.అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా, 40 రకాల వాసనలను గుర్తించే ఒక ప్రత్యేకమైన పరీక్షను ఉపయోగించారు. కోవిడ్ సోకిన తర్వాత తమ వాసన పసిగట్టే సామర్థ్యంలో మార్పు వచ్చిందని చెప్పిన వారిలో 80 శాతం మంది, దాదాపు రెండేళ్ల తర్వాత జరిపిన ఈ పరీక్షలో చాలా తక్కువ స్కోరు సాధించారు. వీరిలో 23 శాతం మంది వాసనను గుర్తించే శక్తిని తీవ్రంగా లేదా పూర్తిగా కోల్పోయినట్టు స్పష్టమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa